ఏపీ సీఎం జగన్ భువనేశ్వర్ కి చేరుకున్నారు. కొటియా గ్రామాల వివాదంపై జగన్ ఫోకస్ పెట్టనున్నారు. నేరడి బ్యారేజ్,జంఝావతి ప్రాజెక్టుపై సీఎంలు చర్చించనున్నారు. కాసేపట్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో జగన్ భేటీ కానున్నారు. ఉభయరాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వంశధారపై నేరడి దగ్గర బ్యారేజ్ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్ట్, కొఠియా గ్రామాల సమస్యపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా నుంచి 103 ఎకరాలు అవసరమని అధికారులు తెలిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో 6 వేల ఎకరాల భూమికి సాగునీరు వస్తుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement