ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో సోమవారం విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపింది. మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉంది.
- Advertisement -
అయితే, ఢిల్లీ జలబోర్డులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లలేదు. కేవలం కోర్టుకు మాత్రమే ఆయన హాజరయ్యారు. ఈడీ నోటీసులు రాజకీయ కుట్రలో భాగమని ఆప్ ఆరోపిస్తోంది. ఎటువంటి అవకతవకలు జరగకపోయినా.. తమను వేధించేందుకు బీజేపీ అక్రమ కేసులు బనాయిస్తుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.