నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సాగర్ నియోజకర్గంలో ఇవాళ పర్యటించిన సీఎం కేసీఆర్ సాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని స్పష్టం చేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్నిచ్చి ముందుకు నడిపించినందుకు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా మహమ్మారి కారణంగా సాగర్‌కు రావడం ఆలస్యమైందన్నారు. తనను కూడా కరోనా విడిచిపెట్టలేదు. ఎన్నికలు అయిపోగానే ఇక్కడకు రాలేకపోయాను. సమస్యలు చాలా పెండింగ్‌లో ఉన్నాయి అని సీఎం తెలిపారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆ ఎమ్మెల్యేలు రిపోర్టు ఇచ్చారు. గ్రామాల్లో పొలాలకు వెళ్లేందుకు కూడా సరిగా కల్వర్టులు లేవని చెప్పారు. హాస్పిటళ్ల పరిస్థితి కూడా బాగాలేదని చెప్పారు. హాలియా పట్టణాన్ని చూస్తేనే తమ సమస్య అర్థమవుతుందని చెప్పారు. హాలియాను అద్భుతంగా చేయాలి. ఇక్కడ రోడ్లు సరిగా లేవు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. వాటన్నింటిని క్రమక్రమంగా పూర్తి చేసుకుందాం అని కేసీఆర్ అన్నారు.
నందికొండ, హాలియా మున్సిపాలిటీకి నిధులు కావాలని అడిగారు. హాలియాకు రూ. 15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ మున్సిపాలిటీల అభివృద్ధికి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలన్నారు. ఇక సాగర్ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. సిబ్బంది, భవనం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మిని స్టేడియం కూడా మంజూరు చేస్తాం. ఆర్ అండ్ బీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టల నిర్మాణానికి రూ. 120 కోట్లను మంజూరు చేస్తున్నాను. మొత్తంగా రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నాను అని తెలిపారు.
ఇది కూడా చదవండి: బీ అలర్ట్: ఆగస్టులోనే థర్డ్ వేవ్ ముప్పు..?