యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాలమర్రిలో రెండోసారి పర్యటన కొనసాగుతోంది. సుమారు గంటకు పైగా దళితవాడలో 60 కుటుంబాలను సీఎం కేసీఆర్ పలుకరించి.. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై గ్రామస్థులతో చర్చించనున్నారు. గత పర్యటన సందర్భంగా తాను చేసిన పలు సూచనల అమలుతీరుపై ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. గత జూన్ 22న తొలిసారిగా వాసాలమర్రికి వచ్చిన ముఖ్యమంత్రి.. గ్రామస్థులతో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించి అనంతరం సహపంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరోసారి గ్రామానికి వచ్చారు.
ఇది కూడా చదవండి: ఇతగాడే అందరి కంటే అందగాడట..