తెలంగాణలో జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, అడిషనల్ కలెక్టర్లు హాజరుకానున్నారు. అలాగే అటవీశాఖ జిల్లాస్థాయి అధికారులు, సంరక్షకులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, హరితహారం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రకృతి వనాలను అభివృద్ధి చేసే విషయమై లక్ష్యాన్ని నిర్ధేశించనున్నారు. కాగా, ఈ దఫా హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: రాయలసీమకు నీరిస్తామని కేసీఆరే చెప్పారు: మంత్రి పెద్దిరెడ్డి