జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రం కొండగట్టుకు బుధవారం సీఎం కేసీఆర్ రానున్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ కొండకట్టుకు వస్తుండడంతో మంగళవారం హెలిప్యాడ్‌ను, ఏర్పాట్లను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్
పరిశీలించారు. వారి వెంట జడ్పీటీసీ రాం మోహన్ రావు, కొడిమ్యాల ఎంపీపీ మెన్నేని స్వర్ణలత రాజ నర్సింగరావు, సర్పంచులు తిరుపతి, సుదర్శన్ తదితరులు ఉన్నారు. వాస్తవానికి మంగళవారమే సీఎం కొండగట్టుకు రావాల్సి ఉండగా అనివార్యకారణాలతో పర్యటన బుధవారం వాయిదా పడింది. సీఎం పర్యటన సందర్భంగా ఇప్పటికే అధికార, పోలీసు యంత్రాంగం పలుమార్లు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కొండగట్టుకు సీఎం కేసీఆర్.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు
Advertisement
తాజా వార్తలు
Advertisement