తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తున్న గులాబీ పార్టీ అధినేత.. హస్తినలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.. ఇక, ఈ మూడు రోజుల పర్యటనలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. ఇక సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్న ఆయన.. సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేస్తారు.. సీఎం కేసీఆర్ తో పాటు ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు పాల్గొంటారు.. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.. అక్కడే నిర్మాణం చేపట్టనున్నారు.. ఇక, సెప్టెంబర్ 3న మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు కేసీఆర్.
ఇది కూడా చదవండి: ఏపీలో వైసీపీ ప్రేరేపిత పోలీసు రాజ్యం: డీజీపీకి చంద్రబాబు లేఖ