Thursday, November 21, 2024

ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్‌కు శంకుస్థాపన చేసిన కేసీఆర్

దేశ రాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ కార్యాల‌యానికి గురువారం నాడు శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన భూమి పూజ‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయ‌నతో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌తినిధులు ఆ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ మ‌ధ్య భూమి పూజ నిర్వ‌హించారు. తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణం కోసం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని వ‌సంత్ విహార్‌లో చేప‌ట్టారు.

టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపన సందర్భంగా ఢిల్లీలోని వ‌సంత్ విహార్ వేద‌ఘోష‌తో మారుమోగింది. ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 1100 చ‌ద‌ర‌పు మీట‌ర్ల ప్రాంగ‌ణంలో తెలంగాణ భ‌వ‌న్‌ను నిర్మించ‌నున్నారు. త్రీ ప్ల‌స్ త్రీ రీతిలో భ‌వ‌నాన్ని క‌ట్ట‌నున్నారు. గురువారం నాడు భూమి పూజ స‌మ‌యంలో ముందుగా సీఎం కేసీఆర్ హోమంలో పాల్గొన్నారు. వేద వ‌చ‌నాల‌తో వసంత్ విహార్ వెల్లువిరిసింది. పండితులు మంత్రోచ్ఛ‌ర‌ణ‌తో శుభ‌సందేశాలిచ్చారు. మంగ‌ళ‌క‌ర‌మైన దీవెన‌ల‌తో ఆ ప్రాంగ‌ణం దివ్య‌వెలుగులు చిమ్మింది.

ఈ వార్త కూడా చదవండి: కేసీఆర్‌ను మించిన హిందూవు లేడు: గుత్తా సుఖేందర్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement