ధర్మారం : అన్నదాత కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈరోజు ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామంలోని పొలంలో మంత్రి కొప్పుల నాగలిపట్టి దుక్కి దున్ని రైతులతో కలిసి వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో రైతు రాజ్యం నడుస్తుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వరంలాంటి ప్రాజెక్టు నిర్మాణంతో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. రైతులకు పంట పెట్టుబడి మొదలు కొని పంట చేతికి వచ్చాక కొనుగోలు చేసే వరకు ప్రభుత్వమే అండగా నిలుస్తుందన్నారు. ఈకార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement