సీఎం కేసీఆర్ కొత్త చరిత్ర సృష్టించారని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు మద్ధతుగా సిరిసిల్లలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై టీఆర్ఎస్ యుద్ధం చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేశారన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఎరువులు, విత్తనాల బాధ లేదన్నారు.
రైతు బంధు ప్రకటించిన ఏకైక నేత కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత చాలా మంది ఈ స్కీమ్ ను కాపీ కొట్టారన్నారు. చివరికి కేంద్రం కూడా ఈ పథకం కాపీ కొట్టిందన్నారు. రైతుల ఉత్సాహం చూస్తే తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగేవన్నారు. అప్పట్లో ఎరువుల కోసం క్యూ లైన్లు ఉండేవన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు. సిరిసిల్లలో ఏప్రిల్ లో మానేరు మత్తడిని ఎప్పుడైనా కలగన్నారా అన్నారు. నర్మాల చెరువు మత్తడి దూకుతుంటే మన గుండె పులకించలేదా అని కేటీఆర్ అన్నారు.