Friday, November 22, 2024

కేంద్రంపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ మరో సారి ఫైర్‌ అయ్యారు. పల్లె, పట్టణ ప్రగతిపై కలెక్టర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరుగా పల్లెలకు కేంద్రం నిధులు పంపడం చిల్లర వ్యవహారమన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా కేంద్రమే పథకాలు అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు. స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికే తెలుస్తాయని, కేంద్రానికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. రోజువారీ కూలీ డబ్బులు కూడా నేరుగా కేంద్రమే పంచాలనుకోవడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. దేశంలో కరెంటు, తాగునీరు లేక జనం రోడ్డెకుతున్నారన్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ధ్వంసమైన తెలంగాణను మ‌ళ్లీ పునర్‌ నిర్మిస్తున్నామని, తిరిగి బాగుచేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. అన్ని కష్టాలను అధిగమించి దేశం గర్వించేలా తెలంగాణను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పల్లె పట్టణ ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement