Wednesday, November 20, 2024

దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశాలు ఇవి: సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘దళిత బంధు’ పథకంపై ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు కొనసాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గ ఎస్సీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. పథకం లక్ష్యాలు, అమలు, కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ ప్రతినిధులు సాధించే విజయం మీదే.. యావత్‌ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందన్నారు. పథకం విజయవంతానికి అందరూ దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం.. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించినట్లు గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం విజయవంతం చేయాలని సూచించారు. పథకం అమలు ప్రభావం యావత్ తెలంగాణపై ఆధారపడి ఉంటుందని వివరించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి నలుగురు చొప్పున, మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చొప్పున మొత్తం 412 మంది ఎస్సీ పురుషులు, మహిళలు సదస్సులో పాల్గొన్నారు. వీరితోపాటు మరో 15 మంది రిసోర్స్ పర్సన్లు ఇలా.. మొత్తం 427 మంది సదస్సులో పాల్గొన్నారు. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు పథకాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సీఎం కేసీఆర్ వీరికి అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement