తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి రెగ్యులర్ కార్యదర్శులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. అయితే వారి ప్రొహిబిషన్ పిరియడ్ మాత్రం మారో ఏడాది పెంచుతున్నామన్నారు. అయితే గ్రామంలో మెక్కలు పెంచడం, ఇతర పనులు మంచిగా జరగడమే తమ లక్ష్యమన్నారు. అంతే కాని వారిని వేధించానలన్నది తమ భావన కాదన్నారు. ఈ నేపథ్యంలో కార్యదర్శులకు పలు నిబంధనలు విధించామన్నారు. నిబంధనల కారణంగానే గ్రామాల్లో మొక్కల పెంపు కార్యక్రమం ఆశించిన ప్రయోజనాన్ని ఇచ్చిందన్నారు. కాగా ఒకప్పుడు వీఆర్ఏలకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు మాత్రమే ఉండేదన్నారు. ఇప్పుడు వారికి రూ. 14 వేల వరకు వేతనాలు అందిస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని లేకుండా చేయడమే లక్ష్యంగా ధరణి వెబ్ సైట్ను తీసుకువచ్చామని కేసీఆర్ పేర్కొన్నారు.
అటు తెలంగాణలో గతంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని తప్పక ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కరోనా కారణంగా నిరుద్యోగ భృతిని ఇవ్వలేకపోయామన్నారు. ఏ రాష్ట్రాల్లో ఎలా ఇస్తున్నారని అధ్యయనం జరిగిందని.. దీనిపై సమీక్షలు జరిపి నిరుద్యోగ భృతిని త్వరలోనే ఇస్తామని స్పష్టం చేశారు. అటు హాస్టల్ విద్యార్థులకు త్వరలో మెస్ ఛార్జీలను పెంచుతామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.