వర్షాలు, వరద బీభత్సంలో తెలంగాణ జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోదావరి పరివాహక జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ క్రమంలో ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేశారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం హెలికాప్టర్‌లో ఏటూరు నాగారం చేరుకున్నారు. అక్కడి ఐటీడీఏ గెస్ట్ హౌజ్ లో లంచ్ చేసి.. అనంతరం కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన ముంపు బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి, ముంపు బాధితులను సీఎం పరామర్శిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement