ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు బీఆర్‌ఎస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్.
కేసీఆర్ కు ఇటీవలే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ జరిగింది. అయితే కేసీఆర్ సర్జరీ అనంతరం డిశ్చార్జి అయి జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో ఉంటున్నారు. కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే పలువురు రాజకీయ నాయకులు కేసీఆర్ ను పరామర్శించారు. అయితే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంతి జగన్ ఇవాళ కేసీఆర్ ను పరామర్శించారు.
జగన్ కు కెటిఆర్ స్వాగతం ….
నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు.
మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఇక సీఎం జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు.