ప్రతీ ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరు, వాడ జాతీయజెండాని ఎగురవేస్తుంటాం. దీని రూపశిల్పి మన అచ్చ తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. తాజాగా అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వతంత్ర సంగ్రామం లో పింగళి వెంకయ్య పాత్ర, జాతీయ పతాకం రూపకల్పనలో ఆయన విశేష కృషిని స్మరిస్తూ కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. పింగళి వెంకయ్య 146వ జయంతిని ఆగస్టు 2 న నేడు (మంగళవారం) ఢిల్లీలో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ జెండాని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.
Advertisement
తాజా వార్తలు
Advertisement