సీఎం జగన్ ఉభయగోదావరి జిల్లాల్లో వరద ప్రభావి ప్రాంతాల పర్యటనకి వెళ్ళారు.ఈ మేరకు సీఎం వరద బాధితులతో స్వయంగా మాటలాడారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల పరిధిలో వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ట్రాక్టర్‌పై ముందుకు సాగుతున్న జగన్… వరద బాధితుల కష్టాలను స్వయంగా ఆలకిస్తున్నారు. ఈ సందర్భంగా తన వద్దకు ఓ వినతి పత్రం చేతబట్టుకుని 8 నెలల బాలుడితో వచ్చిన ఓ మహిళ నుంచి వినతి పత్రాన్ని స్వీకరించిన జగన్… ఆమె చేతిలోని బాలుడిని తన చేతుల్లోకి తీసుకున్నారు. కాగా జగన్ జేబులోని పెన్ను ఆ బాలుడు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కాసేపటికి ఆ బాలుడిని తల్లికి అందజేశారు జగన్. ఈ సందర్భంగా బాలుడు జగన్ వైపు చూడగా… తన జేబులోని పెన్ను తీసిన జగన్… దానిని బాలుడికి అందించారు. ఈ మొత్తం దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement