ఏపీ ప్రజలు కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి తప్పేటట్లు లేదని వ్యాఖ్యానించారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూనే, కరోనాతో యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. మాస్కులు వేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని సూచించారు. వీటిని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పారు.
కాగా సీఎం జగన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు. జగన్ మాత్రం క్యాంప్ కార్యాలయం వీడి బయటకు రారని, ప్రజలు మాత్రం కరోనాతో సహజీవనం చేయాలని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. కరోనాతో సహజీవనం చేయాలని, బ్లీచింగ్ పౌడర్ వాడాలని ఫస్ట్ వేవ్‌లో జగన్ అన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే మాట అన్నారు. అయితే గతంలో కంటే ఇప్పుడు కేసుల సంఖ్య పెరిగాయి. రోజుకి 20 వేల కేసులు వస్తున్నాయి. దీంతో ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలు వింటుంటే ఏపీలో లాక్‌డౌన్ పెట్టేది లేదని పరోక్షంగా చెప్తున్నారని.. జనం వాళ్ల చావు వాళ్లను చావమన్నట్లు ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.