ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగం, ఉపాధి లేకుండా చేశారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జగన్ నమ్మి మోసపోయినట్లు యువతకు తెలిసొచ్చిందని, గెలిపించిన యువతే ఇప్పుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. వైసీపీ సర్కార్ ఎంతమందికి ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో మద్యం, ల్యాండ్ మాఫియాలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ డ్రగ్ మాఫియాలో సీఎం కేజ్రీవాల్ పాత్ర ఉందని ఆరోపించారు. లిక్కర్ మాఫియాతో ఏపీ ప్రభుత్వానికి లింకు ఉందని తెలిపారు. త్వరలోనే అన్ని బయటకొస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అవినీతి జరిగే రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఏపీ, రెండో స్థానంలో తెలంగాణ ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్, జగన్ అవినీతిలో పోటీపడుతున్నారని అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement