Friday, November 22, 2024

ఏపీలో అందుకే స్కూళ్లు తెరిచాం: సీఎం జగన్

ఏపీ వ్యాప్తంగా నేడు స్కూళ్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండో విడత కింద మనబడి నాడు-నేడు పాఠశాలలను ప్రారంభించింది. ఈ మేరకు తూ.గో. జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బె​స్ట్‌’ అని రాసి సీఎం జగన్‌ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హైస్కూల్‌ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.

స్కూళ్లు తెరవాలని నిపుణులు చెబుతున్నారని, అందుకే రాష్ట్రంలో బడులు ప్రారంభించామని సీఎం జగన్ తెలిపారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలు రాసి రెండెళ్లవుతుందని, కోవిడ్ ప్రోటోకాల్స్‌తో పాఠశాలలు ప్రారంభించామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా పేదల కోసమేనన్న సీఎం.. విద్యార్థుల భవిష్యత్ కోసం మేనమామలాగా పనిచేస్తున్నామన్నారు. విద్యార్థుల విషయంలో ఎక్కడా రాజీపడటంలేదని సీఎం జగన్ తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు… పరిస్థితి ఉద్రిక్తం

Advertisement

తాజా వార్తలు

Advertisement