కడప, ప్రభన్యూ,స్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రేపు (శనివారం) కడప జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు రానున్నారు. జగన్ శనివారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌ఫోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 10.20 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 10.55కు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ చేరుకుంటారు. 11.05 గంటల నుంచి 11.25 గంటల వరకు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సమాధివద్ద నివాళ్లు అర్పిస్తారు. అనంతరం 11.35 గంటల నుంచి 12.05 గంటల వరకు స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడతారు.
12.35 గంటలకు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమై కడప ఎయిర్‌ఫోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా 1.50 గంటలకు గన్నవరం విమానా శ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2.20 గంటలకు సిఎం తాడేపల్లిలోని తన నివాసంకు చేరుతారు.
కాగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా అధికారులు ప్రత్యేక భ ద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ఎటువంటి లోటుపాట్లు ఎదురుకాకుండా అధికారుల అప్రమత్తంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీ అన్బురాజన్ పర్యవేక్షణలో పోలీసుయం త్రాంగం అప్రత్తమైంది. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇడుపులపాయలో పటిష్ట భ ద్రత కల్పించారు.