Monday, November 18, 2024

AP | కువైట్ అగ్ని ప్రమాద బాధితులకు సాయం.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు

కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించారు. వారి మృతదేహాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement