Monday, October 28, 2024

TG | పారా ఒలింపిక్స్ విజేత దీప్తి జివాంజీకి కోటి నజరానా, గ్రూప్-2 ఉద్యోగం….

పారిస్‌ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ క్రీడాకారిణి దీప్తి జివాంజీ ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తిని మరింత ప్రోత్సహించేందుకు గ్రూప్-2 ఉద్యోగంతోపాటు రూ.కోటి నగదు బహుమతిని అందజేస్తామని రేవంత్ ప్రకటించారు. దీంతోపాటు వరంగల్ లో 500 గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక‌ దీప్తి జివాంజీ కోచ్ రమేష్ కు రూ.10 లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పారాలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహం కోసం ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement