Friday, November 22, 2024

క్లస్టర్‌, సెక్షన్‌ కమిటీలను తక్షణమే పూర్తి చేయాలి.. జోనల్ ఇన్‌చార్జీల భేటీలో చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ కమిటీల తక్షణమే నియమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ జోనల్‌ ఇంఛార్జిలను ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి చంద్రబాబు నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..క్లస్టర్‌ ఇంఛార్జ్‌ నియామకాలు పూర్తి కాని 30 నియోజకవర్గాలపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లో క్లస్టర్‌ , యూనిట్‌ నియామకాలు వారంరోజుల్లోపూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా బూత్‌ కమిటీల నియామకం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు.

ఆగస్టు మొదటి వారం నుండి 15వ తేదీ లోపు సెక్షన్ల నియామకం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం జోనల్‌ ఇంఛార్జిలు సంబంధిత జోనల్‌ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నిర్ధేశిత సమయంలోగా కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమీక్షలో జోన్‌-1 ఇంఛార్జి బుద్ధా వెంకన్న, జోన్‌-2 ఇంఛార్జ్‌ ప్రత్తిపాటి పుల్లారావు, జోన్‌-3 ఇంఛార్జ్‌ డోలా.బాలవీరాంజనేయస్వామి, జోన్‌-4 ఇంఛార్జ్‌ అనగాని సత్యప్రసాద్‌, జోన్‌-5 ఇంఛార్జ్‌ అమర్నాథ్‌ రెడ్డి, ప్రోగ్రామ్స్‌ కమిటీ ఇంఛార్జ్‌ మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement