దేశంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే చార్ ధామ్ యాత్ర ముగింపు తేదీలను కేదార్‌నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ తాజాగా ప్రకటించింది. హిమాలయాల్లోని ఛార్‌ధామ్ (యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్) ఆలయాలను దర్శించుకోడానికి వేసవి నుంచి శీతాకాలం వరకు ఏడాదిలో ఆరు నెలల పాటు మాత్రమే అనుతిస్తారు.
హిమాలయా ప్రదేశాల్లో ఛార్‌ధామ్ ఉండటం వల్ల శీతాకాలంలో మంచు తీవ్రత దృష్ట్యా యాత్రను నిలిపివేస్తారు. కాగా, సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.
నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12.14 గంటలకు గంగోత్రి ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు. అలాగే యమునోత్రి, కేదార్ నాథ్ ఆలయాలను నవంబర్ 3న మూసివేస్తున్నట్లు ప్రకటించగా.. బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17న రాత్రి 9.07 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లడించారు.
ఆ రోజు సాయంత్రం చివరి పూజ నిర్వహించి, అక్కడ అఖండ జ్యోతిని వెలిగించి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. వీటితో పాటు, రుద్రనాథ్ ప్రవేశ ద్వారాలు అక్టోబర్ 17న మూసుకోనుండగా.. నవంబర్ 4న తుంగనాథ్, నవంబర్ 20న మధ్యమహేశ్వర్ మూతపడనున్నాయి. వీటితో పాటు, రుద్రనాథ్ ప్రవేశ ద్వారాలు అక్టోబర్ 17న మూసుకోనుండగా.. నవంబర్ 4న తుంగనాథ్, నవంబర్ 20న మధ్యమహేశ్వర్ మూతపడనున్నాయి.