Saturday, November 23, 2024

kolkata | సందీప్ ఘోష్ తో సాన్నిహిత్యం… ముగ్గురు డాక్ట‌ర్ల‌పై వేటు !

కోల్‌కతా : ఆర్‌‌జీ కర్ వైద్యురాలి ఘటనపై విచారణ చేపట్టిన‌ సీబీఐ, పలు అవినీతి కేసుల్లో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది. కాగా, ఆయనకు సన్నిహితంగా ఉన్న ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్ల్యూబీఎంసీ) శనివారం ప్రకటించింది.

ముగ్గురు వైద్యుల్లో బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ రేడియో డయాగ్నసిస్ విభాగానికి చెందిన మాజీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అవిక్ డే, పాథాలజీ విభాగానికి అనుబంధంగా ఉన్న మాజీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ బీరుపాక్ష బిస్వాస్… మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌కు చెందిన జూనియర్ డాక్టర్ ముస్తాఫిజుర్ రెహమాన్ మల్లిక్ ఉన్నారు. వీరు సందీప్ ఘోష్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని, ప‌లు లీడ‌ర్ల‌తో ఉన్న సంబంధాలను ఉపయోగించి జూనియర్ డాక్టర్లను వేధించినట్లు తేలింది.

కాగా, సెప్టెంబర్ 5న, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య సేవల నుండి అవిక్ దే, బిస్వాస్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్‌తో పాటు అవిక్‌పై శాఖాపరమైన విచారణను కూడా జరగనుంది. మరోవైపు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అవకతవకలతో సంబంధం ఉన్నందున ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సందీప్ ఘోష్‌కి మెడికల్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో షోకాజ్ నోటీసుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుంటే అతడి రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement