Tuesday, November 26, 2024

ఉక్రెయిన్‌కు క్లింటన్‌, బుష్‌ సంఘీభావం

అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌లు క్రెయిన్‌కు మద్దతుగా నివాళి అర్పించారు. చికాగోలోని ఉక్రెయిన్‌ చర్చికి వెళ్లిన ఆ ఇద్దరూ పుష్పగుచ్ఛాలతో నివాళి ప్రకటించారు. ఉక్రెయిన్‌ జాతీయ జెండాలోని బ్లూ, ఎల్లో రిబ్బన్లు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. చికాగోలోని సెయింట్‌ వొలోడిమిర్‌, ఓలా క్యాథలిక్‌ చర్చి వద్ద ఇద్దరూ బొకేలను పెట్టారు.

ఉక్రెయిన్‌ ప్రజలకు అమెరికా అండగా ఉందని చెప్పారు. పుష్పాంజలి వీడియోను బిల్‌ క్లింటన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement