ఈ నెల 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి లో భాగంగా 3వ రోజైన ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఊరూరా తిరుగుతూ పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అత్యంత చురుగా పాల్గొంటున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ.. ఉత్తేజ పరుస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో వాడవాడలా తిరిగారు. ప్రజలతో మాట్లాడుతూ, పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించారు. చెత్తా చెదారం ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాలువల్లో మట్టి, చెత్త పేరుకుపోవడం చూసి, వెంటనే సపాయి పని చేశారు. కాలువలో మట్టిని తీసేశారు. అలాగే గ్రామస్థులను పలకరిస్తూ, వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శిని పిలిచి మరింత జాగ్రత్తగా పని, పర్యవేక్షణ చేయాలని హెచ్చరించారు. కొడకండ్ల మండలం రేగులలో మంత్రి ఉపాధి హామీ కూలీలతో మమేకం అయ్యారు. వారితో కలిసి పని చేశారు. వారి పనితీరు, అందుతున్న కూలీ, జరుగుతున్న పనులను ఆరా తీశారు. ఉపాధి కూలీలు పెట్టిన చద్దన్నం తిన్నారు. ఆ బువ్వ కమ్మగా ఉందంటూ… అందరినీ సంతోష పెట్టారు. అందరితో ఔరా!… అనిపించుకుంటూ… సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పల్లె ప్రగతి కార్యక్రమాలకు ఉపక్రమించారు.
మోరీలను సాఫ్ చేస్తూ.. పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తూ.. పల్లె ప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి
Advertisement
తాజా వార్తలు
Advertisement