Wednesday, November 20, 2024

కర్ణాటకలో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ.. 18 మంది అరెస్టు

కెరూర్‌: కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లా కెరూర్‌ పట్టణంలో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురికాగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలియజేశారు. పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి ఇప్పటివరకు 18మందిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కెరూర్‌లో ఘర్షణలు చెలరేగాయి. సంఘటన జరిగిన వెంటనే రెండు గ్రూపులు దుకాణాలు, బండ్లను ధ్వంసం చేశాయి. ఆ దుర్ఘటనలో ఒక మోటారుసైకిల్‌ కూడా దగ్ధమైంది.

ప్రస్తుతం పరిస్థితి పూర్తి ప్రశాంతంగా ఉంది. హిందూ ముస్లిం వర్గాలకు చెందిన 18 మందిని అరెస్టు చేశామని బాగల్‌కోట్‌ పోలీసు సూపరింటెండెంట్‌ జయప్రకాశ్‌ తెలిపారు. కొంతమంది అమ్మాయినిలను ఆటపట్టిస్తున్నారని ఆరోపిస్తూ యాసిన్‌ అనే వ్యక్తిని హిందూ గ్రూపులోని కొందరు సభ్యులు దాడి చేసిన తర్వాత ఘర్షణలు చెలరేగాయని ఆయన తెలిపారు. ఇది తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. యాసిన్‌ తనవైపు నుండి ఎక్కువ మందిని తీసుకువచ్చి తనను ఎదుర్కొన్న గ్రూపుపై దాడికి పాల్పడ్డాడని జయప్రకాష్‌ తెలిపారు. ఒక హిందూ బృందం ముస్లిం ప్రాంతంలోకి ప్రవేశించి బైక్‌లను ధ్వంసం చేసి వాహనానికి నిప్పు పెట్టడానికి ముందు ఒక వ్యక్తిని కూడా కత్తితో పొడిచారు. గతంలో ముస్లింలను బహిష్కరించాలని పిలుపునిచ్చినందుకు వార్తల్లో నిలిచిన కర్నాటకలో జరిగిన మతపరమైన హింసాకాండలలో ఈ ఘర్షణలు తాజాగా జరిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement