Sunday, November 17, 2024

ఉగాది ఎప్పుడు..? రేపా? ఎల్లుండా?

ఈ ఏడాది ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అన్న విషయంపై కొంత గందరగోళం నెలకొంది. కొందరు 12వ తేదీ అంటుంటే.. మరికొందరు 13వ తేదీ అంటున్నారు. దీంతో ప్రజల్లో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఉగాది పండుగపై వేదపండితులు క్లారిటీ ఇచ్చారు.

2021 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 13వ తేదీన ఉగాది పండగను ప్రజలంతా జరుపుకోవాలని ప్రకటించారు. కాగా ప్రతి ఏడాది తెలుగు సంవత్సరంలోని మొదటి రోజును ఉగాది పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ. అలాగే 2021 లో ‘ప్లవ’ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఉగాది నాడే వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ రోజుతో మొదలైన నవరాత్రులు శ్రీ రామ కళ్యాణంతో ముగుస్తాయి. రానున్న ఏడాదిలో మనకు కలిగే మంచి, చెడులను పంచాంగ పఠనం ద్వారా తెలుసుకుని జాగ్రత్త పడుతుంటాం. తిధి, నక్షత్ర, వారం మొదలైనవన్ని దేవతా స్వరూపాలుగా భావించి ఏడాది అంతా మంచి జరగాలని ఆరాధిస్తాం.

కాగా ఉగాది పండుగ రోజు పచ్చడి చేసుకుని దేవుడికి నైవేధ్యం పెట్టి ఆ ప్రసాదం తినడం కూడా మనకు ఆనవాయితీనే. ఉగాది పచ్చడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఈ 15రోజుల పాటు నియమబద్ద జీవితం, పవిత్రమైన, పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement