ప్రవక్తమహమ్మద్ సల్లల్లాహు సలాం పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని హజ్రత్ జుంలేషా వలి దర్గా నందు మిలదున్ నబి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రవక్తమహమ్మద్ సల్లల్లాహుసలాం .. తలనీలాలు.. ప్రవక్త వాడిన దుస్తులను భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ వేడుకలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర .. శ్రీకాళహస్తి వన్ టౌన్ ఎస్ఐ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులతో సహా హజ్రత్ జుంలేషా వలి దర్గాని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. నేడు మహమ్మద్ సల్లల్లాహు సలాం పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణం స్వర్ణముఖీనది సమీపంలో ఉన్న జుంలేషావలి వలి దర్గా నందు ఆసారేషరిఫ్ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. కాగా భక్తులు ప్రవక్త యొక్క తలనీలాలను.. దుస్తులను దర్శించుకుని బాబా కృపకు పాత్రులయ్యారని చెప్పారు .ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి సయ్యద్ ఆహమ్మద్, దర్గా వంశస్థులు బాబా ఫరీద్, దర్గా కమిటీ సభ్యులు రాజేశ్వర రావు రమేష్ బాబు , నాగేశ్వరరావు , మోహన్ భార్గవ్, జహంగీర్, బావజాన్, కాలేషా, బావజాన్ , తదితరులు పాల్గొన్నారు.