Friday, November 22, 2024

మూడు దేశాల మైనారిటీలకు పౌరసత్వం

అఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ కు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం జారీ చేసింది. ఈ మూడు దేశాల నుంచి వచ్చి గుజరాత్‌లోని మెహసానా, ఆనంద్‌ జిల్లాల్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు, బౌద్దులు, జైనులకు 1955 నాటి పౌరసత్వం చట్టం కింద పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు కేంద్రం ఇచ్చింది. ఈ పౌరసత్వాన్ని1955 నాటి చట్టం కిందే మంజూరు చేస్తారు, 2019 నాటి పౌరసత్వ చట్ట సవరణ (సిఏఏ) కింద కాదని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement