Thursday, September 12, 2024

TG: మద్యం మత్తులో సీఐ కొడుకు వీరంగం..

ఓ సీఐ కొడుకు ఒక క్యాబ్ డ్రైవర్ ఫై ప్రతాపం..
ఘటనపై కాజీపేట పీఎస్ లో పిర్యాదు…
నిందితులను అరెస్టు చేయకుండా మధ్యలోనే వదిలేసిన పోలీస్ అధికారులు
నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం

కాజీపేట, ఆగస్ట్ 13 (ప్రభ న్యూస్) : మా అయ్య పోలీస్ మాకే అడ్డు చెప్తావ్ రా.. మేము అనుకుంటే ఎక్కడైనా ఎమైనా చేయగలమ్.. మమ్మల్ని ఆపేంతా దైర్యం నీకుందా రా అంటూ ఓ పోలీస్ అదికారి కొడుకు ఓ సామాన్య క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసి చితబాదిన సంఘటన హ‌న్మ‌కొండ నడిబొడ్డులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కాజీపేట చౌరస్తాలో తెల్లవారుజామున 4గంటల సమయంలో వీఆర్ సీఐ పూర్ణచందర్ కొడుకు క్యాబ్ డ్రైవర్ పిండి రాజుపై కొందరు యువకులతో వీరంగం సృష్టించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పబ్లిక్ ప్లేస్ లో మూత్రం పోయవద్దని చెప్పినందుకు ఏడుగురు మిత్రులతో కలిసి క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశారని తెలిపారు. దెబ్బలకు తట్టుకోలేక పక్కనే ఉన్న బస్టాండ్ లోకి పరిగెత్తిన క్యాబ్ డ్రైవర్ వెంటపడి మరీ యువకులు దాడి చేశారని తెలిపారు.

అడ్డు వచ్చిన వారిని జేబులలోని పాకెట్ నైఫ్ లతో బెదిరించారని తెలిపారు. చేతికి ఉన్న కడియంతో క్యాబ్ డ్రైవర్ తలపై గుద్దడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో తోటి డ్రైవర్లు108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పక్కన నిలిపి ఉంచిన 3 కార్ల అద్దాలపై కొట్ట‌డంతో పగుళ్లు రావడం జరిగిందని తెలిపారు. స్టేషన్ కి తరలించిన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారని తెలిపారు. తమ తండ్రి సిద్దిపేటలో సీఐ అని, త‌న‌ను ఎవరూ ఏమీ చేయలేరంటూ డ్రైవర్ల‌ను బూతులు తిట్టిన యువకుడు దాడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి వివరణ అడుగగా.. సంఘటనపై విచారణ చేసి తప్పు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement