Monday, December 2, 2024

Cinema – షూటింగ్‌లో విజయ దేవరకొండకు గాయం

హీరో విజయ దేవరకొండ షూటింగ్‌లో గాయపడ్డారని సమాచారం. యాక్షన్‌ సీన్స్‌ని షూట్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తున్నది. వెంటనే చిత్రయూనిట్‌ చికిత్స కోసం విజయ్‌ని ఆసుపత్రికి తరలించారని, వైద్యులు ఫిజియో థెరఫీ చేస్తున్నట్లు సమాచారం.

ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిసింది. దీనిపై చిత్రబృందం స్పందించలేదు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వీడీ12 మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement