తమిళ సినీ స్టంట్ మాస్టర్ కనల్ కణ్ణన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరంగం ఆలయం వెలుపల పెరియార్ విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పుదుచ్చేరిలో ఆయనను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ సెక్షన్ 153 బీ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కనల్ కన్నన్ ను అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు మధురవాయల్ లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో… వడపళని, వలసరవాక్కంలోని ఇళ్లలో కూడా వెతికారు. ఆయన కనిపించకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడనే నిర్ణయానికి వచ్చారు. మరోవైపు తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన పుదుచ్చేరిలో తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెల్ ఫోన్ ఆధారంగా ఆయన పాండిచ్చేరిలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement