మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న కర్నూల్ సీబీఐ కార్యాలయంలో హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చింది. నిన్న విచారణకు హాజరైయ్యేందుకు 10 రోజులు సమయం కావాలని దేవినేని ఉమా కోరారు. అయితే, సీఐడీ మాత్రం రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది.
సీఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీఐడీ అధికారులు దేవినేని ఉమపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ వీడియోను మార్ఫ్ చేశారంటూ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 464, 465, 468, 471, 505 కింద దేవినేని ఉమాపై సీఐడీ కేసు నమోదు చేసింది.