Monday, November 18, 2024

సోషల్ మీడియా లో పోస్ట్ లు….సీఐడీ దర్యాప్తు!!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంత మంచి జరుగుతుందో చెడు కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ఏ చిన్న విషయం అయిన ఇట్టే వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో నియంత్రణ లేకపోవడంతో ఎవరికి నచ్చిన పోస్టులు వాళ్లు పెడుతూ కొంతమంది ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారిపై కొన్ని సార్లు కేసులు కూడా నమోదు అవుతూ ఉంటాయి.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టె వారిపై సిఐడి దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. న్యాయమూర్తులపై అసత్య ప్రచారం చేస్తూ…. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తుంది. కుట్రపూరితంగా న్యాయమూర్తులపై కేసులు పెడుతున్నారని సిఐడి కి సమాచారం అందడంతో విచారణ చేసేందుకు సిద్ధమైంది. రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారనే కోణంలో సిఐడి విచారణ చేస్తోంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై పోస్టులు పెట్టడం, లైకులు కామెంట్లు ఫార్వర్డ్ చేయడం నేరమని సిఐడి సోషల్ మీడియా ఫ్యాక్టరీ ఫైండింగ్ టీమ్ దీనిపై దర్యాప్తు చేసి ఎంతటి వారైనా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్న కఠిన చర్యలు తీసుకుంటుందని సీఐడీ తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement