నైజీరియాలోని ఓండోలోని కాథలిక్ చిర్చి రక్తసిక్తమైంది. ఉన్మాదులు తుపాకీతో రెచ్చిపోయారు. ఆదివారం చర్చిలోకి చొరబడి ప్రార్థనలు చేస్తున్న భక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసిరినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది వరకు మృతి చెందగా.. చాలా మంది గాయపడినట్లు తెలిపారు. అయితే ఇందులో అధికంగా చిన్నపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చరిత్రలో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదని అక్కడి ప్రజా ప్రతినిధి ఒలువోల్ చెప్పారు. క్రైస్తవులకు ఆదివారం ప్రత్యేక దినం కావడంతో ప్రార్థనలు నిర్వహించడానికి అధిక సంఖ్యలో భక్తులు రాగా… ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్ర దాడిలో ఎంతమంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే చనిపోయారని ఆ దేశ మీడియా చెబుతోంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మదు బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఖచ్చితమైన మరణాల సంఖ్య వెంటనే స్పష్టంగా తెలియలేదు, కానీ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ప్రజలను దారుణంగా చంపడాన్ని ఖండించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement