ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీకైంది. డెహ్రాడూన్‌కు సమీపంలోని ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఝంజ్రా ప్రాంతంలో ఓ ఖాళీ ఇంట్లో క్లోరిన్ సిలిండర్ల నుంచి గ్యాస్ లీకైంది.
మంగళవారం ఉదయం చోటుకున్న ఈ ఘటనతో సమీపంలో ఉన్న పలు నివాసాల్లోని ప్రజలు తీవ్రమైన శ్వాస ఇబ్బందలను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. అక్కడ నివసించే పలు కుంటుంబాలను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి.