Friday, November 22, 2024

తీహార్​ జైలులో చిత్రారామచంద్రన్​.. మనీలాండరింగ్​ కేసులో ఈడీ వాంగ్మూలం రికార్డు

మనీ లాండరింగ్​ కేసులో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ. అయితే.. ఆమెతోపాటు కేసులో ఇతర నిందితుల నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు ఇవ్వాల (మంగళవారం) తెలిపారు. కాగా, చిత్రా నుంచి రెండుసార్లు స్టేట్​మెంట్​ రికార్డ్​ చేశారు. ప్రివన్షన్​ ఆఫ్​ మనీలాండరింగ్​ యాక్ట్​ (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈ స్టేట్‌మెంట్ నమోదు చేసినట్లు వారు తెలిపారు.

చిత్రా రామకృష్ణను మార్చి 6వ తేదీన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులు అరెస్టు చేశారు. ఆ తరువాత నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) కో-లొకేషన్ స్కామ్ కేసు, బోర్స్ లో ఇతర గవర్నెన్స్ అవకతవకలతో ముడిపడి ఉన్న దర్యాప్తులో ఇప్పుడు చిత్రా తీహార్ జైలులో ఉన్నారు. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ అయిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును విచారిస్తోంది. ఇక.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న మూడవ ఏజెన్సీ ఆదాయపు పన్ను శాఖ.

చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించడంలోజరిగిన అవకతవకలు, పాలనా వైఫల్యాలకు సంబంధించి ఇటీవలిపలు ఆరోపణలు వచ్చాయి. ఎన్‌ఎస్‌ఇ కో-లొకేషన్ కేసులో అవకతవకలు జరిగాయన్న కారణంగా మనీలాండరింగ్ విచారణను ఈడీ చేపట్టింది.  కో-లొకేషన్ కేసులో ప్రమేయం ఉన్న బ్రోకర్ల ఇళ్లల్లోలోనూ గత నెలలో ED పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement