కమల్ హసన్ హీరోగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ త్రిల్లర్ తో తెరక్కుతున్న చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించగా అవినాష్ రవిచందర్ సంగీతం అందించారు. కమల్ హసన్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ద్వారా రూపొందుతున్న ‘విక్రమ్’ జూన్ 3వ తేదీన విడుదల కానుంది. అయితే.. కమల్ హసన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి నాలుగేళ్లు అవుతోంది.. తమిళనాడు ప్రజల కోసం వారికి సేవ చేయడంలో బిజీగా ఉన్న సూపర్ స్టార్ నాలుగేళ్ల విరామం తర్వాత వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఫిబ్రవరి 2018లో కమల్ అధికారికంగా తన రాజకీయ పార్టీ మక్కల్ నీది మైయ్యంని తమిళనాడులోని పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ప్రాంతీయ పార్టీగా ప్రారంభించారు. కమల్ చివరిసారిగా అదే సంవత్సరంలో ‘విశ్వరూప్ II’లో తెరపై కనిపించాడు.
ఇక.. ఈ నాలుగేళ్ల విరామం గురించి ఓ ఇంటర్వూలో మాట్లాడిన కమల్.. ఇది చాలా కాలం గడిచిందని, అయితే అది ఒక ముఖ్యమైన కారణం కోసమే అని చెప్పుకొచ్చారు . “నేను నా రాష్ట్ర ప్రజల కోసం చాలా ముఖ్యమైన పని చేస్తున్నా.. వారి కోసమే రాజకీయాల్లో ఉన్నా.. అందుకే ఈ గ్యాప్ వచ్చింది.. నేను ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నాను.. కాకపోతే ఈ సినిమా చేయడానికి అనుమతి తీసుకున్నాను’’ అంటూ వివరించారు.. నన్ను సినిమాలో చూడబోతున్నందుకు కొంత మందికి సంతోషంగా ఉంది.. కానీ, నన్ను ఎక్కువ మంది రాజకీయాల్లో చూడడం చాలా సంతోషంగా భావిస్తారు అని ఆయన అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..