తిరుమల ఘాట్ రోడ్డుపై చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో తిరుమల ఘాట్ రోడ్లపై చిరుతలు, పులులు స్వేచ్ఛగా విహరించాయి. జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణులు రోడ్లమీదకు వచ్చి కనువిందు చేశాయి. అయితే, కరోనా తరువాత ఇప్పుడు తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో చిరుతలు రోడ్లమీదకు రావడంలేదు. అయితే, ఆదివారం అర్థరాత్రి సమయంలో తిరుమత మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. మొదటి ఘాట్ రోడ్డులోని వినాయకస్వామివారి ఆలయం వద్ద చిరుత సంచరించింది. భక్తులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌నో వీడియోగా చిత్రీకరించారు. మొదటిఘాట్‌రోడ్డులో చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు, ఆ చిరుతను అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. రాత్రి సమయంలో చిరుతలు ఘాట్ రోడ్డుమీదకు వస్తున్నాయని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ హెచ్చరికలు జారీచేసింది.
ఇది కూడా చదవండి: భవానీపూర్ లో మమతా బెనర్జీ ఘనవిజయం..