ఆ క్షణాలు అద్భుతం అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అసలు విషయం ఏంటంటే నిన్న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు రక్తదానం చేయడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం తన మనసును తాకిందని పేర్కొన్నారు. అంతేకాదు, తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా వెళ్లి వేడుకలు జరుపుకున్నానని చిరంజీవి వెల్లడించారు. కుటుంబ సభ్యులతో గడిపిన ఆ క్షణాలు అద్భుతమని వివరించారు. ఈ మేరకు ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement