ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్ల సవరింపుపై మెగస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రజలకు వినోదాన్ని అందించడంతో పాటు.. సినీ పరిశ్రమ మనుగడను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. ఇంతకుముందు పలు మార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు భేటీ అయ్యి టిక్కెట్ల విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిటీ వేసిన ప్రభుత్వం.. టికెట్ల ధరలను సవరిస్తూ ఇవ్వాల జీవో వెలువరించింది. ఒక్కో థియేటర్లో రెండు రకాల టికెట్లు ఉండేలా కొత్త జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం. కాగా, ప్రీమియం, నాన్ ప్రీమియం రేట్లు ఉండేలా ఈ జీవోలో టికెట్ రేట్లను నిర్ధారించినట్టు తెలుస్తోంది..
‘‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా.. అటు థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త GO జారీచేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించటం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రి పేర్ని నానికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు’’ అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..