Saturday, November 23, 2024

‘మీ ప్ర‌తాపం సినీ ప‌రిశ్ర‌మ పైనా’ … జ‌గ‌న్ స‌ర్కార్ పై చిరంజీవి మండిపాటు

ఇటీవ‌ల ఎంపి స‌ర్కార్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పైనా, న‌టిన‌టుల‌పై పైనా విమ‌ర్శ‌ల దాడి పెంచింది.. మ‌రి ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై నేరుగానే విరుచుకుపడుతున్న‌ది.. ఈ నేప‌ధ్యంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా రాజ‌కీయ అంశంపై పెద‌వి విప్పారు. “యాక్టర్ల రెమ్యునరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి” అని అన్నారు చిరంజీవి.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి – రవితేజ నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య” సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్ లో చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు చిరంజీవి . . “పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..” అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

వాల్తేరు వీరయ్య చిత్ర విజయం తనకెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పిన చిరు… ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు ఆడేవని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు.. రెండు వారాలే ఆడుతున్నాయని.. ఇలాంటి నేపథ్యంలో వాల్తేరు వీరయ్య 200 రోజులు ప్రదర్శిచడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement