ప్రముఖ సినీ గాయకుడు జి.ఆనంద్ మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఎన్నియల్లో.. ఎన్నియల్లో… ఎందాకా.. అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్రదానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరు దరహాసి శ్రీ జి.ఆనంద్ గారు కర్కశమైన కరోనా బారిన పడి ఇక లేరు అని నమ్మలేకపోతున్నాను. మొట్టమొదటి సారి వెండి తెరమీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన, అవినాభావ బంధం ఏర్పరచింది. ఆయన ప్రస్థానం నన్ను వెన్నాడే విషాదం. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
కాగా, జి.ఆనంద్ గత రాత్రి హైదరాబాదులో కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనా బారినపడిన ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. సకాలంలో సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడ్డారు.