విశ్వంభర షూటింగ్ స్పాట్ కి వచ్చిన మంత్రి
సాదరపూర్వక స్వాగతం పలికిన యూనిట్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కందుల దుర్గేష్ మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర షూటింగ్ సెట్స్ కు వచ్చారు.. ఈ సందర్భంగా ‘విశ్వంభర’ యూనిట్ ఆయనకు స్వాగతం పలికింది. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు శుబాకాంక్షలు తెలిపారు.. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు..
అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని దుర్గేష్ చేప్పడం ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలని అన్నారు.
- Advertisement -