సంగారెడ్డి, (ప్రభ న్యూస్): తెలంగాణ హ్యాండ్ల్యూమ్ సంస్థ చైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిన చింతా ప్రభాకర్‌ను నియమించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కేడర్, చింతా అనుచరులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకుంటూ సందడి చేశారు.
జిల్లా టీఆర్ ఎస్ కేడర్ చింతా నియామకంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఐబీ గెస్ట్ హౌస్ వద్ద సోమవారం హడావుడి చేశారు. ‘‘చింతా ప్రభాకారన్న జిందాబాద్’’ అనే నినాదాలతో టౌన్ మొత్తం మారుమోగింది. కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క నాగరాజ్ గౌడ్, జలంధర్, ప్రభు గౌడ్, సాయి గౌడ్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.