Friday, November 22, 2024

తైవాన్‌ చుట్టూ చైనా యుద్ధమేఘాలు.. యుద్ధవిమానాలు, నౌకలు, మిస్సైల్స్‌ మోహరింపు

తైవాన్‌ చుట్టూ చైనా యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. చైనా ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్న తైవాన్‌లో అగ్రరాజ్యం అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసి పర్యటనకు కౌంటర్‌గా చైనా ఆ ద్వీపం దేశం చుట్టూ సైనిక విన్యాసాలు ప్రదర్శించింది. సైనిక విన్యాసాల్లో చివరి రోజైన ఆదివారం చైనా దేశ మిలటరీ పరాక్రమాన్ని తైవానతో పాటు ప్రపంచదేశాలకు చాటి చెప్పే విధంగా సైనిక విన్యానాలు నిర్వహించింది. తైవాన్‌కు కేవలం ఇరవై కిమీల దూరంలో ఆ దేశానికి చుట్టూ ఉన్న ఆరు జోన్లలోనూ, సముద్ర జలాలు, గగనతలంలోనూ భారీస్థాయిలో సైనిక విన్యాసాలను ప్రదర్శించింది. యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఆరు జోన్లలో మిసైల్‌ దాడులతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. తైవాన్‌ చుట్టూ భారీస్థాయిలో లాంగ్‌ రేంజ్‌ ఎయిర్‌ స్ట్రై క్స్‌ను చైనా నిర్వహించింది తైవాన్‌కు 27 యుద్ధ నౌకలను పంపిన చైనా, తైవాన్‌కు అతిసమీపంలో విన్యాసాలు నిర్వహించింది. చైనా సైనిక ప్రదర్శనను అమెరికా తీవ్రంగా ఖండించింది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌లు సైతం తక్షణం సైనిక విన్యాసాలు నిలిపి వేయాల్సిందిగా చైనాను హెచ్చరించాయి.

అయితే, చైనా అధికారికంగా సైనిక విన్యాసాల ప్రదర్శన ముగిసినట్లు ప్రకటించలేదు. పైగా చైనా మిలటరీ పరాక్రమాన్ని చాటి చెప్పే ఒక వీడియోను ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఒక విడుదల చేసింది. వందకు పైగా యుద్ద విమానాలు, చైనా కొత్త జనరరేషన్‌ ఏరియల్‌ రెఫ్ల్యూల్లర్‌ వైయు -20, పది విధ్వంసక ట్యాంకర్లతో పాటు పలు ఆయుధసంపత్తిని ఈ వీడియోలో ప్రదర్శించింది. సాయుధదళాల సైనిక విన్యాసాలను సైతం ఆ వీడియోలో ప్రదర్శించింది. తమ దేశ భూభాగానికి అత్యంత సమీపంలో, చైనా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల ప్రదర్శనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తైవాన్‌, ప్రస్తుత పరిస్థితిని తైవాన్‌ నిశితంగా పరిశీలిస్తోంది. చైనా సైనిక విన్యాసాలకు ధీటుగా బదులివ్వడానికి తైవాన్‌ ఆర్మీని సైతం రంగంలోకి దింపడం గమనార్హం..

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement