Friday, November 22, 2024

జిన్‌ పింగ్‌ ప్రత్యక్షంపై దుమారం.. కారణాలు వెల్లడించిన చైనా మీడియా

బీజింగ్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బీజింగ్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌ పాల్గొంటే, ప్రపంపవ్యాప్తంగా హాట్‌ న్యూస్‌గా మారింది. జిన్‌పింగ్‌ను చైనా ఆర్మీ అదుపులోకి తీసుకుంది, ఆయన గృహ నిర్భందం, స్వీయ నిర్భంధమని రకరకాల వార్తలు వెలుపడిన నేపథ్యంలో జిన్‌పింగ్‌ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, జిన్‌పింగ్‌ అదృశ్యం వెనుక కొవిడ్‌ కారణమని ఆ దేశ మీడియా ప్రకటించింది. కొవిడ్‌ కట్టడి కోసం చైనాలో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి.

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా ఏడు రోజులు తప్పనిసరిగా హోటల్‌ క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత మూడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో గడపాలి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈనెల 16న ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్మాత మయన్మార్‌లో పర్యటించి బీజింగ్‌ తిరిగి వెళ్లారు. దీంతో, చైనా కొవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం ఏడు రోజులు హోటల్‌ క్వారంటైన్‌, మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారని చైనా మీడియా వెల్లడించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement